మద్నూర్, బతుకమ్మ: జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలానికి చెందిన నాయకులు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హైదారాబాద్‌లో శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా, ఏకమై బయలుదేరారు. ఈ ప్రత్యేక కార్యక్రమం “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్” నినాదంతో జరుగుతుంది అని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ సభకు గ్రామ అధ్యక్షుల సమిష్టిగా పాల్గొనడం ద్వారా పార్టీ బలోపేతానికి మరింత బలమైన సందేశం ఇవ్వడం, రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిద్ధప్ప పటేల్, బాలు యాదవ్, క్యాదర్కుంటే భగవాన్, విట్టల్ యాదవ్ తదితరులు వెళ్లారు.