Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 4:04 pm Posted by : ramakrishna

సుదర్శన్ రెడ్డి సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా నియమితులై పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా నిజామాబాద్ కు విచ్చేయుచున్న సుదర్శన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకడానికి బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  గురువారం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో కాంగ్రెస్ నాయకులు కర్క అశోక్, షేక్ నిస్సార్, షేక్ గౌస్, పట్ల సురేష్, రవి తదితరులు ఉన్నారు.