బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ, బతుకమ్మ : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 70 మంది మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం...