కమ్మర్ పల్లి, బతుకమ్మ :
కమ్మర్ పల్లి మండలంలోని పలు భాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని కోనసముందర్ గ్రామానికి చెందిన భూమేశ్వర్ కువైట్ లో చనిపోవడంగా వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన మారంపల్లి ఆశన్న పెరాలసిస్ వ్యాధితో బారిన పడగా ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ వాళ్ల నాన్న లింగ గౌడ్ కు గుండె ఆపరేషన్ జరగగా ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. హాసకొత్తూరు గ్రామానికి చెందిన బద్దం రవి వాళ్ళ నాన్నమ్మ బద్దం లింగు చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఏనుగు మోహన్, ఏనుగు రాజేశ్వర్ వాళ్ళ నాన్న ఏనుగు రాములు చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఉప్లూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి ఆవారి రమేష్ కుమారుడు భువన్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.