Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:12 pm Posted by : ramakrishna

నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నాయకుల నిరసన

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బుధవారం మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులు, విద్యార్థుల గొంతును అణచివేసే చర్యలు సమర్థనీయం కావని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు కర్క అశోక్, కాసుల మహేష్, పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పార్వతి ప్రవీణ్, నెరుగంటి బాలరాజు, వంజరి సీతారామ్, గాండ్ల శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.