డిసిసి అధ్యక్షున్ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

బతుకమ్మ, ఏర్గట్ల : బుధవారం మోర్తడ్ ప్రజా నిలయానికి నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికై,  మొట్టమొదటిగా మోర్తాడ్ వచ్చిన కాటిపల్లి నగేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ను,ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్,ముస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి, దండ బోయిన సాయి, సుదన వేణి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.