కాంగ్రెస్ నాయకుల సంబరాలు
రుద్రూర్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గల శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుతూ, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిన్న జరిగిన తెలంగాణ శాసన సభ సమావేశంలో కులగణనలో భాగంగా సుమారు 56% ఉన్న బీసీలకు 42 శాతం బీసీ...