Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 6:57 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నాయకుల సంబరాలు

రుద్రూర్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గల శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద  మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుతూ, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిన్న జరిగిన తెలంగాణ శాసన సభ సమావేశంలో కులగణనలో భాగంగా సుమారు 56% ఉన్న బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. బీసీలకు ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, ఉద్యోగ పరంగా గాని, రాజకీయ పరంగా గాని బీసీలకు ఎంతో అవకాశం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రిత్వ శాఖలకు, ఎమ్మెల్యేలకు రుద్రూర్ మండల  కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారోజిగంగారం, పత్తి రాము, కర్క అశోక్, ఇందూర్ కార్తీక్, అడప సాయిలు, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, చిక్కడపల్లి రవి, షేక్ నిస్సార్ , పట్టేపు రాములు, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Congress leaders celebrate