Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 4:48 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

రుద్రూర్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం టపాకాయలు పేలుస్తూ  ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట  అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, తోట సంగయ్య, దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, కర్క అశోక్, అడప సాయిలు, పార్వతి ప్రవీణ్, కుర్మాజి సాయిలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.