Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 8:25 pm Posted by : ramakrishna

బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి అప్రజాస్వామికం

  • తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్

 

సిరిసిల్ల, బతుకమ్మ :భద్రాద్రి జిల్లాలోని ములుగు గూడూరు ప్రాంతంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంపై నమోదైన దాడిని దుర్మార్గమని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ రవి గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ లో  బి ఆర్ ఎస్ పార్టీకి అన్ని సర్వేలూ అనుకూలంగా వచ్చిన సమయంలో కాంగ్రెస్ నాయకులు అమర్యాదపూర్వక చర్యలు చేపట్టడం అంగీకరించలేమని అన్నారు. పార్టీ కార్యాలయం లో కార్యకర్తలపై దాడులు చేయడం సిగ్గు పరచే సంఘటన అని హక్కుల కోసం, ప్రజల కోసం నిలబడే మా సంకల్పాన్ని ఎలాంటి భౌతిక దాడులు కూడా వంచలేవు” అని చెప్పారు.ఇలాంటి అనవసర దాడులు రాజకీయ పరిణామాలను శాసించలేవని బాధితులను శాసించలేవని గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు  ఎస్కే ఆప్రోచ్, వడ్లూరి వేణు, సిరిమల్లె హరీష్, సంపత్, కనకయ్య, రమేష్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు.