Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 8:47 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి వీడియో వైరల్

  • బస్సు డ్రైవర్ల పై బూతు పదజాలం
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులు
  • నెట్టింట విమర్శల వెల్లువ

 

నిజామాబాద్, బతుకమ్మ:

కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు ముత్యాల సునీల్ రెడ్డి ఇటీవల తన సంస్ధ (ఆరేంజ్ ట్రావేల్స్) లో పనిచేసే బస్సు డ్రైవర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆరేంజ్ ట్రావేల్స్ లో పని చేసే డ్రైవర్లు నాలుగు నెలల వేతనాల కోసం ఇటీవల అడుగగా వారిని ముత్యాల సునీల్ రెడ్డి బండ బూతులు తిడుతు బెదిరించిన  తీరు వీడియోలో ఉంది. అంతే గాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఎవ్వరికి చెప్పుకున్నా తనకేం కాదని అంటు మాట్లాడిన వీడియో నిజామాబాద్ జిల్లా సోషల్ మీడియా గ్రూప్ లలో వైరల్ అవుతున్నాయి. దానిని బాల్కొండలోని బిఆర్ఎస్, బిజేపి నాయకులు సోషల్ మిడియా ప్లాట్ ఫాంలలో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ఉన్న నాయకుడు తన వద్ధ పనిచేసే కార్మికుల పట్ల అలా వ్యవహరించాల్సింది కాదని మరికొందరు సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సంకుల సమరం జరుగుతుండగా సునీల్ రెడ్డి వీడియో సొషల్ మీడియాలో గిరికీలు కొడుతుండటంతో ఆయన వ్యతిరేక వర్గం కుడా సంబంధిత వీడియోను గ్రామ , మండల గ్రూప్ లలో పోస్టులు చేస్తున్నట్లు సమాచారం.