కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
జిలిటన్ స్టిక్ కేసులో రిమాండుకు తరలించిన కామారెడ్డి పోలీసులు స్థానికంగా కలకలం రేపుతున్న ఘటన కామారెడ్డి,బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కామారెడ్డి లో దొరికిన నిషేధిత పేలుడు పదార్థాలు( జిలేటిన్ స్టిక్స్ ) అక్రమ వినియోగం, నిలువ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పీసీసీ కార్యవర్గంలో కామారెడ్డి జిల్లా నుంచి చోటు దక్కించుకున్న వారిలో...