Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 5:46 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నేత ఎలమంచలి శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతల ఆగ్రహం

 

. . . బీఆర్ఎస్ నాయకులతో డబ్బులు పంచడంపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు

 

. . . కాంగ్రెస్ ఓటమికి కుటిలయత్నం చేస్తున్న ఇందూరి చంద్రశేఖర్ కు తగిన గుణపాఠం చెప్తాం

 

. . . తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఇందూర్ చంద్రశేఖర్ పై అధిష్టానం చర్యలు తీసుకునేలా చేస్తాం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేస్తున్న ఎలమంచలి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి డబ్బులు పంచడం పై కాంగ్రెస్ నాయకులు, ఆగ్రోస్ ఇండస్ట్రియల్ రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల లో భాగంగా సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ఇందూరు చంద్రశేఖర్ బాన్సువాడ పట్టణంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలమంచిలి శ్రీనివాస్ తో కలిసి ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఓడించడం కోసం డబ్బులు పంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలమంచిలి శ్రీనివాస్ తో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఆయనకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ బాన్సువాడ పట్టణంలోని ఐదో వార్డులో తిరుగుతూ డబ్బులు పంచడం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చేతులు కలపడం పార్టీకి ద్రోహం చేసినట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలమంచిలి శ్రీనివాస్ తో చేతులు కలిపి డబ్బులు పంచుతున్న సమయంలో తాము పట్టుకోవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఇందూరు చంద్రశేఖర్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంచుతున్న ఇందూరు చంద్రశేఖర్ పై ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలపడం కాంగ్రెస్ పార్టీకి ఏనలేని మచ్చ తెస్తున్నారని ఇలాంటి వ్యక్తిపై అధిష్టానం కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే వారు ఎంతటి వారైనా సహించేది లేదని, ఎన్ని కుట్రలు చేసినా బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయనన్నారు.