ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ కు  లేదు

హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది ఎంపీ అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు  ఓట్లడిగే అర్హత లేదని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యనించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో గల మున్నూర్ కాపు సంఘం ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. మంత్రులు ఏసీ గదులకు పరిమితం అయ్యారన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో మహిళలు చీపుర్లు పట్టుకుని రెడీ గా ఉన్నారని చెప్పారు....