నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం
కోటగిరి, బతుకమ్మ : నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతుందని బీఆర్ ఎస్ మండల యువజన విభాగం నాయకులు గంగా ప్రసాద్ గౌడ్ ఆరోపించారు మంగళవారం కోటగిరి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులను పెద్ద ఎత్తున వాడుకోవడం జరిగిందని ఆరోపించారు. సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు నిరుద్యోగ యువకులకు ఒక్కో దరఖాస్తుకు సుమారు రూ. 50 వరకు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులతో పనులు చేయించుకోవడం జరిగిందన్నారు. ...