గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోంది
ఎల్లారెడ్డి, బతుకమ్మ : గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా 12వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. బస్ స్టాండ్...