Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:43 pm Posted by : ramakrishna

భీమ్ గల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

 

. . . బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

భీమ్ గల్ పట్టణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే భీమ్ గల్ అభివృద్ధికై రూ.54 కోట్ల నిధులను మంజూరు చేసిందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణ శివారులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తాను ఒక ఎమ్మెల్యేనని మర్చిపోయి కనీస భాద్యత లేకుండా కేవలం ప్రభుత్వాన్ని భద్నాం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. 2022 లో జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో పది పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసి అప్పుడు రోడ్లు, భవనముల  మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ను పిలిపించుకొని ఎనిమిది అంటే ఎనిమిది నెలల్లోనే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఆసుపత్రి నిర్మాణానికి డబ్బులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడానికి మూడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారన్నారు. ఇంకా అవసరమైన మేరకు నిధులను మంజూరు చేసి ఆసుపత్రిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు 2021 లొ శంకుస్థాపన చేసి టి యు ఎఫ్ ఐ డీ సీ నుండి కోటి, ప్రత్యేక నిధుల నుండి 2 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారని, దానికి ఒక్క నయా పైసా బిల్లు కూడా చెల్లించలేదన్నారు. భీమ్ గల్ అభివృద్ధికి మొదటి అడ్డంకి ప్రశాంత్ రెడ్డి కమిషన్లు తీసుకోవడం ఆయనకు ఆనవాయితీ పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడేలా చేశారన్నారు. కాంట్రాక్టర్లను పనులు చేయాలని అడిగితే గత ప్రభుత్వంలో చేసిన పనులు తాలూకు బిల్లులన్ని పెండింగ్లో ఉన్నాయి అంటున్నారన్నారు. వంద పడకల ఆసుపత్రిని అతి తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుందన్నారు. గతంలో రవణా శాఖ మంత్రిగా ఉండి కూడా ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్ బస్ డిపో ను తెరిపించలేకపోయారని,  ఏదో ఎన్నికల ముందు నాలుగు బస్సులను ఆర్మూర్ నుండి తెచ్చి పార్కింగ్ చేసి బస్ డిపో ప్రారంభించినట్లు చేసారన్నారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా గానీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గానీ,మేము ఏనాడు బస్ డిపో తెరిపిస్తామని చెప్పలేదని, వారిలా దొంగ మాటలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. యూరియా యాప్ విషయంలోనూ రైతులలొ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదన్నారు. నీళ్ల విషయంలోనూ ప్రశాంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే తప్పకుండా ప్రభుత్వం నీళ్లు ఇస్తుందన్నారు. ఎస్సారెస్పీ లొ 25 టిఎంసీల నీళ్ళున్న లీకేజీ నీళ్లు అడిగిన పాపానికి బాల్కొండ నియోజకవర్గ రైతుల మీద కేసులు పెట్టిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదని, అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పేరుమీద కమిషన్లు మింగిన ప్రశాంత్ రెడ్డి కాళేశ్వరం పథకం ద్వార ఒక్క టి ఎం సీ నీటినైనా ఎస్సారెస్పీ లొ నింపారా ? ఆయన గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రజలకు నిజాన్ని వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఇంజనీర్ గా ప్రశాంత్ రెడ్డి కట్టిన చెక్ డ్యాంల వలె పునరుజ్జీవన పథకం మిగిలిపోయిందని ఏద్దేవా చేశారు. కరువు పరిస్థితులు తెలిసి కూడా ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతులను నిండా ముంచిన ఆయన ఈరోజు దొంగ మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరన్నారు. ఇకనైనా తన డ్రామాలు ఆపి తాను ఎమ్మెల్యేనని తనను తాను గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.