Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 1:15 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ అంబేడ్కర్ ను అడుగడుగున అవమానించింది

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

పూలాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహ శుద్ధి

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో ఆదివారం గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమంలో  భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహ శుద్ధి  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎంపీ అర్వింద్, అర్బన్, ఆర్ముర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ హాజరయ్యారు. ఈ సందదర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ అంబేడ్కర్ ను అడుగడుగున అవమానించిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బడుగు బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. అంబేడ్కర్ ను  ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ పాటు పడ్డాడన్నారు.  నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంబేడ్కర్ కి భారతరత్న ఇవ్వలేదన్నారు. బీజేపీ చొరవతోనే అంబేడ్కర్ కు భారతరత్న లభించిందన్నారు. అంబేడ్కర్ పుట్టుక నుంచి మరణం వరకు వారు జీవించిన ఐదు ప్రదేశాలను పంచ తీర్ధాల పేరుతో టూరిజం హాబ్ గా అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీదే అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.