Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 6:38 pm Posted by : ramakrishna

కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

 

. . . పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

 

. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 

మోపాల్, బతుకమ్మ :

 

మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మోపాల్ మండలానికి చెందిన 104 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాళా తీసిందని విమర్శించారు. వృద్ధులకు త్వరలోనే పెన్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, రైతు భీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాల ద్వారా పేదలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఇందిరామహిళా శక్తి కింద డ్రాక్వా గ్రూపులు సిండికేట్‌గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు రూ.70,000 ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు వివరించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఉచిత కరెంట్, రైతుభరోసా, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పాగంగా రెడ్డి, పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సిబ్బంది పాల్గొన్నారు.

 

 

Congress government's goal is to make one crore women crorepatis
Congress government's goal is to make one crore women crorepatis