Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 6:50 pm Posted by : ramakrishna

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో  ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్  నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనీ  పలు కాలనీల లోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత  ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగ అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం అన్నారు.

Congress government stands by the poor