. . . కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్ వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతే రాజ్యంగా రైతుల పక్షాన నిలిచిన ప్రభుత్వంగా ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు 500 బోనస్ తో పాటు, రైతు భరోసా చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెనువెంటనే తూకం చేయాలన్నారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ కు 2389 రూపాయలు, కామన్ వరి ధాన్యానికి 2369 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. రైతులు దళారులను నమ్ముకొని ధాన్యాన్ని అమ్ముకుంటే హరిగోసలు పడాల్సి వస్తుందని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని తెలిపారు. లారీల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, మాజీ ఎన్డిసిసిబి డైరెక్టర్ కోరాట్ పల్లి ఆనంద్, గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఉప సర్పంచ్, మండల వ్యవసాయ అధికారులు శ్రీకాంత్, ఏఈఓ ప్రకాష్ గౌడ్, సీఈవో శ్రీకాంత్, కిషన్, సిబ్బంది రవి, కిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసది, పరమేష్, మోతిలాల్ నాయక్, కిషన్, పలువురు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, గన్నారం గ్రామ రైతులు పాల్గొన్నారు.