Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 5:39 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది

 

. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా, షబ్బీర్ అలీ నివాసం వద్ద ఉన్న చౌక ధరల దుకాణంలో మంగళవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన లబ్ధిదారులకు స్వయంగా చీరలు అందజేశారు.

 

Congress government is working towards the welfare of the poor

 

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇందిరమ్మ చీరల పథకం ద్వారా కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, ప్రతి మహిళకు గౌరవాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ, ఇందిరమ్మ ఇండ్లు, 2 బిహెచ్‌కే గృహాలు, పెన్షన్ పథకాలు, రైతులకు మద్దతు, ఇలా ప్రతి వర్గానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్లు షేరు, అన్వార్, వాజీద్, సిద్దిక్, గంప ప్రసాద్ ఆర్డీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

Congress government is working towards the welfare of the poor