కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోంది

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   మహబూబాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహబూబాబాద్ లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసిఆర్ ఫోబియా పట్టుకుందన్నారు. మైక్ పట్టగానే కేసీఆర్ ను తిట్టడం మించి రేవంత్ రెడ్డికి ఇంకో ఆలోచన రాదని అన్నారు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి...