. . . 19 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్
. . . 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు
ఆర్మూర్, బతుకమ్మ :
బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా అందులో 19 వార్డుల్లో కాంగ్రెస్, 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచాయి. 3 వార్డుల్లో ఇండింపెండెంట్ అభ్యర్థులు గెలువగా, 1 వార్డులో ఎంఐఎం పార్టీ గెలిచింది. 2 వ వార్డులో జగన్నాథ్ నాగేంద్ర (కాంగ్రెస్), 4వ వార్డులొ సర్కేలి స్రజన(కాంగ్రెస్), 5వ వార్డులో బండారి శాల గీత(కాంగ్రెస్), 6వ వార్డులో షేర్ల మమత(కాంగ్రెస్), 11వ వార్డులో కాటిపల్లి వెంకటరెడ్డి(కాంగ్రెస్), 12వ వార్డులో తాటి నీలిమ(కాంగ్రెస్), 13వ వార్డులో కోడిగెల మల్లయ్య(కాంగ్రెస్), 14వ వార్డులో షేక్ సైఫ్(కాంగ్రెస్), 15వ వార్డులో గోనే లహరి(కాంగ్రెస్), 20వ వార్డులో అరిఫా కణం(కాంగ్రెస్), 24వ వార్డులో మెడిదాల వెంకట్(కాంగ్రెస్), 25వ వార్డులో భూపేందర్ గూపాల(కాంగ్రెస్), 26వ వార్డులో వన్నెల్ దాస్ శ్రీనివాస్(కాంగ్రెస్), 29వ వార్డులో బతనాసే తిరుమల(కాంగ్రెస్), 31వ వార్డులో బొప్పెన గంగాప్రసాద్(కాంగ్రెస్), 33వ వార్డులో బోడ మీది రాణి(కాంగ్రెస్), 34వ వార్డులో నర్మే నవీన్(కాంగ్రెస్), 35వ వార్డులో సడక్ వినోద్(కాంగ్రెస్), 36వ వార్డులో బరాడ గంగామణి(కాంగ్రెస్)లు గెలుపొందారు. అలాగే 3వ వార్డులో యామాద్రి కవిత (బీజేపీ), 7వ వార్డులో ప్రశాంత్ కుమార్(బీజేపీ), 9వ వార్డులో పోచంపాడు శ్రీనివాస్(బీజేపీ), 16వ వార్డులో దొండి కవిత(బీజేపీ), 18వ వార్డులో శ్రావణ్ కుమార్(బీజేపీ), 21వ వార్డులో బొల్లం అనూష(బీజేపీ), 32వ వార్డులో బోచ్కర్ శ్రీనివాస్ (బీజేపీ)లు గెలుపొందారు. అలాగే 8వ వార్డులో డిచ్ పల్లి శారద(బీఆర్ఎస్), 10వ వార్డులో నయిమ్ మహమ్మద్(బీఆర్ఎస్), 17వ వార్డులో బేగం రైమత(బీఆర్ఎస్), 23వ వార్డులో అన్నారపు నాగరాజు(బీఆర్ఎస్), 28వ వార్డులో తాసిన్ నజియా (బీఆర్ఎస్)లు గెలిచారు. మిగిలిన 1వ వార్డులో సూరయ్య ఫాతిమా(ఇండిపెండెంట్), 19వ వార్డులో దివ్య అగర్వాల్(ఇండిపెండెంట్), 27వ వార్డులో సమీనా బేగం(ఇండిపెండెంట్), 22వ వార్డులో హర్షద్ బేగం (ఎంఐఎం) గెలుపొందారు. ఈ విజయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులందరూ సంబురాలు చేసుకున్నారు.