బోధన్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బోధన్ మున్సిపాలీటీలో మొత్తం 38 వార్డులు ఉండగా వాటిలో 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 12 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించగా, 3 వార్డుల్లో బీజేపీ, 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డులో మాత్రం కాంగ్రెస్, ఇండింపెండెంట్ మధ్య పోటి కొనసాగుతుంది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.