. . . 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం
. . . నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి రాని మెజార్టీ
. . . కామారెడ్డిలో బీఆర్ఎస్ మద్దతే కీలకం
నిజామాబాద్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఉమ్మడి జిల్లాలో అతిపెద్దదైన మున్సిపాల్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 28 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. మేయర్ స్థానం గెలుచుకోవాలంటే 35 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ దక్కించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలను, ఎంఐఎం పార్టీ 13 స్థానాలను, బీఆర్ఎస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ కు, ఎంఐఎంకు మద్దతు ఇచ్చిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలు మాత్రం పొందలేకపోతుంది. నిజామాబాద్ మేయర్ స్థానం దక్కాలంటే కచ్చితంగ ఎక్స్ ఆఫిషియో ఓట్లే కీలకమయ్యాయి. కామారెడ్డిలోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కామారెడ్డిలో 49 స్థానాలు ఉండగా 19 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 16 స్థానాల్లో బీజేపీ, 11 బీఆర్ఎస్, ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కైవసం కావాలంటే బీజేపీ, కాంగ్రెస్ లకు బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి అయింది. ఈ నెల 16న జరిగే మేయర్, చైర్మన్ల ఎన్నికల వరకు అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెర లేపింది. కాంగ్రెస్ పార్టీ బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, భీంగల్, బిచ్కుంద మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీతో గెలుచుకోవడంతో ఆయా మున్సిపాలిటీపై కాంగ్రెస్ జండా ఎగురడం ఖాయమైంది.
నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్ లకు గాను కాంగ్రెస్ 18, బీజేపీ 29, ఎంఐఎం 12, బీఆర్ఎస్ 1 స్థానాలు గెలుపొందారు.
ఆర్మూర్ : మొత్తం 36 వార్డులకు కాంగ్రెస్ 19, బీజేపీ 7, బీఆర్ఎస్ 6, స్వతంత్రులు 3, ఎంఐఎం 1 గెలుపొందారు.
బోధన్ : మొత్తం 38 వార్డులకు కాంగ్రెస్ 17, ఎంఐఎం 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, స్వతంత్రులు 1 లో గెలుపొందారు.
భీంగల్ : మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 8 వార్డులు, బీఆర్ఎస్ 4 వార్డులు, బీజేపీ 0
కామారెడ్డి : మొత్తం 49 వార్డులకు కాంగ్రెస్ 19, బిజెపి 16 , బీఆర్ఎస్ 11 , స్వతంత్రులు 3 వార్డుల్లో గెలుపొందారు.
బాన్సువాడ : మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థి 1
ఎల్లారెడ్డి : మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 10 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్, మరొకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
బిచ్కుంద : మొత్తం 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ గెలుపొందగా, 2 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది.