- రాష్ట్రాన్ని ఏ దండుపాళ్యం ముఠా ఏం చేసిందో కవిత చెప్పారు
- జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతుంది
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటిఆర్ ముఖ్యమంత్రి పై, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేందుకు పామాయల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా ప్రజల 35 ఏళ్ల కల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుని చేసి చూపించామని తెలిపారు. రూ.380 కోట్ల తో తెలంగాణలో టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఆర్వోబీ నిర్మాణాల విషయంలో రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు కూడా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. పదేళ్లలో బి ఆర్ ఎస్ పార్టీ చేసిన నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. పస ఉన్న ఆరోపణలు చేస్తే సమాధానం ఇస్తామని, బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఆదరించే పరిస్థితి లేరని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలువబోతుందని తెలిపారు. చవకబారి విమర్శలు చేయటంలో కేటిఆర్ దిట్టఅని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ..అందుకే ఓపెన్గా మాట్లాడుకుంటారని తెలిపారు. రాష్ట్రాన్ని ఏ దండుపాళ్యం ముఠా ఎం చేసిందో కవిత చెప్పారని అన్నారు. కవిత మాటలకు కేటిఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అతితక్కువ కాలంలో ఎక్కువ అవినీతి కి పాల్పడిన పార్టీ బిఅరెస్ పార్టీ అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామన్నారు. ప్రజల సమస్యల కోసం కవిత పాదయాత్రను చేయటం సంతోషం.. కానీ 10 ఏళ్ళల్లో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాల కాదా చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.