Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 5:18 pm Posted by : ramakrishna

1 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లావణ్య నర్సన్న ప్రచారం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసోజి లావణ్య నర్సన్నకు మద్దతుగా సీనియర్ నాయకుడు పోచారం శంభురెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి హామీలు ఇచ్చారు. వార్డు అభివృద్ధి కోసం లావణ్య నర్సన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని 1వ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు.