స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలి

ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్   రుద్రూర్, బతుకమ్మ:  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలని ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కొడాలి సురేష్ అన్నారు. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కొడాలి...