Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 4:24 pm Posted by : ramakrishna

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలి

  • ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్

 

రుద్రూర్, బతుకమ్మ:  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సత్తా చాటాలని ఏఐయుడబ్ల్యుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడాలి సురేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కొడాలి సురేష్ అన్నారు. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కొడాలి సురేష్ అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి  500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని, 2 లక్షల రుణ మాఫీ చేసి రైతులను రుణ విముక్తులని చేసిందన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని కొడాలి సురేష్ వివరించారు. మహిళలకు ఉచిత బస్సు, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ బడులు సౌకర్యాలని ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.