మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమను తీసుకొచ్చింది కాంగ్రెస్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు. జనాలను ఇబ్బందులకు గురి చేసేది ఎవరైనా...