బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 80 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. గురువారం పట్టణంలోనీ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నసురుల్లాబాద్, మైలారం, నెమలి, రాముల గుట్ట నాచుపల్లి, అంకోల్ గ్రామాల నుండి 80 మంది కాంగ్రెస్ బిజెపి నాయకులు చేరరు.వీరికి బాజిరెడ్డి గోవర్ధ న్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రతి కార్యకర్త నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫలాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. చేరిన వారిలో మామిడి భూమయ్య ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మెక్కా సాయి,పెరక కృష్ణ రాజు, సంతోష్, గంగారం, సాయిలు, అక్కుతార్ తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మోచి గణేష్, సాయిబాబా నరసింహులు, రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
