Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 5:17 pm Posted by : ramakrishna

కాంగ్రెస్, బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వం

  • ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
  • అలవిగాని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

కామారెడ్డి, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్ బిజెపి నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కామారెడ్డిలో శనివారం నిర్వహించిన  బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే కామారెడ్డి వేదికగా డిక్లరేషన్ చేస్తున్నాం.. మాట తప్పితే కాంగ్రెస్ , బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అవసరమైతే మేము కూడా ఢిల్లీ వస్తాం.. బిజెపి పై పోరాటం చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అని అన్నారు. బీసీ డిక్లరేషన్ చేసిన నిజామాబాద్ జిల్లాలోనే ఒక్క బీసీ బిడ్డకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వంచించిందని విమర్శించారు. అలవిగాని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలి కానీ చరిత్ర హీనులుగా మిగలవద్దని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర హీనులుగా మిగిలిపోతుందని అన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత చోటే భాయ్… బడే భాయ్ కి అప్పగించారని తెలిపారు. కోర్టులకు వెళ్తారా… లేదా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల మీద పడతారా మాకు సంబంధం లేదు కానీ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, కానీ ఇప్పటివరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో కంటే ఎక్కువ ఢిల్లీలోనే ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. బీసీల విషయం వచ్చేసరికి ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదని అన్నారు. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ల తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలన్నారు. 4,500 కోట్లు ఖర్చు చేసి 2011లో నిర్వహించిన కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదంటే కాంగ్రెస్ వద్ద సమాధానం లేదన్నారు. 4500 కోట్లు గంగలో పోశారు కానీ లెక్కలు అయితే బయటకు ఇవ్వలేదని తెలిపారు. కులగణన చెయ్యబోమని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బీసీలను వంచించిందన్నారు. తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులను తక్షణమే పార్లమెంటు పాస్ చేయాలని  డిమాండ్ చేశారు. సీ బిల్లులను ఆమోదించడానికి తెలంగాణ బిజెపి ఎంపీ లు పార్లమెంటులో గళమెత్తాలని అన్నారు.