కాంగ్రెస్, బీజేపీ భాయ్ భాయ్
ప్రతీకార పాలనకు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి భూభారతితో భూభద్రత ఉండదు మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ ; రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్...