ఏర్గట్ల, బతుకమ్మ: ఎంబీబీఎస్ సీటు సాధించిన మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ జక్కని సంధ్య మధుసూదన్ కుమార్తె జక్కని శ్రీవర్శిణిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్ లో మంచి డాక్టర్ గా గుర్తింపు పొంది పుట్టిన ఊరికి సేవ చేయాలని ఆకాంక్షించారు. వర్షిణి వరంగల్ ప్రతిమ రికవరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.