నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజ్ ఉత్తమ కళాశాల అవార్డు ను అందుకున్న మేరకు ఆదివారం జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ లు అభినందించారు. హెచ్ఎం టీవీ, హ్యాన్స్ ఇండియా పత్రికల యాజమాన్యం అశ్వర్యంలో పలు అంశాల్లో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఎంపిక చేసి శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవార్డ్ అందజేసారు.