Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 2:58 pm Posted by : ramakrishna

అధికారులకు అభినందనలు  : రాణికుముదిని 

హైదరాబాద్, బతుకమ్మ :  ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఐ.రాణికుముదిని అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు.  ఎన్నికల కోడ్ ను  సమర్థవంతంగా అమలు చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల కోడ్ ముగియనుంద న్నారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు అధికారుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేస్తామన్నారు. ఇందుకోసం కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.