Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:22 pm Posted by : ramakrishna

ఇంటర్ విద్య విలీనం ఆపినందుకు అభినందనలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలపకుండా, ఉన్నత విద్య నుండి తొలగిస్తే వచ్చే ఇబ్బందులను తెలియజేసి, ఆ ప్రక్రియను ఆపడానికి రాష్ట్ర ఇంటర్ విద్య ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చేసిన కృషిని అభినందిస్తూ సోమవారం ఇంటర్ విద్య కార్యాలయం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఇంటర్ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ విద్య ను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపితే వచ్చే ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారని నర్సయ్య తెలిపారు. ఈ సంవత్సరం యధావిధిగా అడ్మిషన్ లు నిర్వహించేందుకు అనుమతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్, జిల్లా ప్రిన్సిపాల్ ల సంఘం నాయకులు, లైబ్రేరియన్ సంఘం ప్రతినిధులు, బోధనేతర సిబ్బంది సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.