జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం
అభివృద్ధి పనులే గెలుపునకు నాంది మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రత్యర్థి అభ్యర్థులతో బరిలో నిలిచి భారీ మెజార్టీతో విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు పాటుపడుతూ అభివృద్ధి పనులలో పురోగతి సాధించడంతో జూబ్లీహిల్స్...