Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 1:56 pm Posted by : ramakrishna

శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్, బతుకమ్మ :  శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు మంగళవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత ఆర్మూర్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈడివిజన్ పరిధిలో  ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.   మూడు చెక్ పోస్ట్ లను ( పోతంగల్ , సాలూర , ఖండ్గావ్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  60 సమస్యత్మక ప్రాంతాలలో పటిష్ట మైన నిఘా వ్యవస్థ ఏర్పాట్లు చేశామన్నారు. 24 ఎఫ్.ఎస్.టీ టీమ్స్ , 4 ఎస్. ఎస్. టీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.  ఆర్మూర్ డివిజన్ పరిధిలో మొత్తము 194 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారన్నారు.  ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై ఇద్దరిపై నందిపేట, కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  కేసు నమోదు చేశామన్నారు.    అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని,  ఎవరైనా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించి నట్లయితే వారిపై 163 బి.ఎన్.ఎస్.ఎస్,. చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించిన ఇద్దరిపై  ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశామన్నారు.