బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామానికి కేంద్రానికి చెందిన ఎక్స్ ఎమ్ పి టి సి మొగులయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్, పాషా సెట్ మృతుడు మొగులయ్య కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. తమ వంతుగా కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలుగా ఉంటామని వారు ధైర్యం చెప్పారు. అధైర్య పడద్దని మనోధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వేంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.