బండి సాయి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల ప్రకారం భగీరథ్ రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, విచారణకు సహకరించాలని,...