Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:47 pm Posted by : ramakrishna

బండి సాయి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల ప్రకారం భగీరథ్ రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, విచారణకు సహకరించాలని, కోర్టు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీర్‌బాద్ పోలీసులు బండి సాయి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మే 16న ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అనంతరం భగీరథ్ చర్లపల్లి జైలులో దాదాపు 49 రోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది.