Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 3:05 pm Posted by : ramakrishna

నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళనలు తప్పవు

 

. . . ఆర్ ఎస్ పీ హెచ్చరిక 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  : 

 

నిజామాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా నిరుపేదలు ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, కానీ ఇప్పటివరకు వారికి స్థిరమైన నివాస హక్కులు కల్పించడంలో ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపలేదని ఆర్ ఎస్ పీ కన్వీనర్ కటారి రాములు అన్నారు. మంగళవారం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ  ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ అర్హులైన పేదలను గుర్తించడానికి సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, “ఇంద్రమ్మ ఇల్లులు” నిర్మించుకునేందుకు కనీసం ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పటికీ ఖాళీగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, కొన్ని ప్రాంతాల్లో అవి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యలను పరిష్కరించి, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములపై నివసిస్తున్న పేదలకు వెంటనే పట్టాలు ఇచ్చి, గౌరవప్రదమైన జీవితం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పేదలను సంఘటితం చేసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్ల నరేష్, గోపాల్, సయ్యద్ రఫీదిన్, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.