Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 4:28 pm Posted by : ramakrishna

తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ యాదగిరి

  • సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్

 

సిరికొండ, బతుకమ్మ : ప్రజలకోసం అన్ని వేళల పని చేసిన త్యాగజివి, తొలితరం విప్లవొద్యమ నేత కామ్రేడ్ యాదగిరి అని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో   సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో  పిబ్రవరి 17 న నిజామాబాద్ లో జరిగే కర్నాటి. యాదగిరి సంతాప సభ పోస్టర్స్ ను  ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కామ్రేడ్. యాదగిరి  జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంభమన్నారు.అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది, అందరికి ఆదర్శంగా నిలిచాడని,మోర్తాడ్, సిరికొండ,భీంగల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్ట్ యోధుడని అన్నారు.కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంకు కృషి చేసాడని, ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించాడమేనన్నారు. నేటి యువతకు కామ్రేడ్. యాదగిరి ఆదర్శంగా నిలిచాడని,ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఈ. రమేష్  ఎస్. కిశోర్, ఎస్.సునీల్ ఎం.డి.ఖధీర్, బి.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.