దొరల ఘడియలపై ఎర్రజెండా ఎగిరేసిన కామ్రేడ్ నర్సన్న
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అతి చిన్న వయసులో ఎర్రజెండా పట్టుకొని దొరల ఘడియలపై ఎర్రజెండా ఎగిరేసిన కామ్రేడ్ నర్సన్న విప్లవోద్యమంలో పనిచేస్తూ రహస్య జీవితం గడిపాడని తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి భామండ్ల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగవ డివిజన్ మాధవ నగర్ కామ్రేడ్ గంగుల నర్సన్న కాలనీలో సిపిఐ (ఎంఎల్) నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమరుడు కామ్రేడ్ గంగుల నర్సయ్య స్మారక స్తూపం నిర్మాణం కోసం...