కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవితం కమ్యూనిస్టులకు ఆదర్శం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవితం కమ్యూనిస్టులకు ఆదర్శమని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్నఅన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి సంతాప సభను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోటగల్లీలోని ఎన్.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు, నిజాయితీ పరుడు, నిరాడంబరుడు, సీపీఐ(ఎం.ఎల్)...