Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 6:20 pm Posted by : ramakrishna

బీబీపేట కళాశాలకు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అందజేత

బీబీపేట, బతుకమ్మ : తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ను గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సాధన సమితి సభ్యులు ఆధ్వర్యంలో మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ రెడ్డి, మట్ట శ్రీనివాస్, అశోక్ గౌడ్ చేతుల మీదుగా కళాశాలలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కళాశాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారని వారు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు, కళాశాల సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. అడిగిన వెంటనే సహకార అందించిన సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్, డా. తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, అశోక్ గౌడ్, దేవునిపల్లి దేవరాజ్,  కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Computer, scanner, and printer donated to BBpet College