భద్రాద్రి కొత్తగూడెం , బతుకమ్మ:
రేషన్ కార్డు ప్రాసెస్ కోసం వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా తహసీల్ధార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు శనివారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన కంప్యూటర్ ఆపరేటర్ . రేషన్ కార్డు ప్రాసెస్ కోసం రూ. 4,000 వేలు కోసం ఓత్తిడి చేసి 2500 లంచం ఇస్తే నే పని జరుగుతుందని కంప్యూటర్ ఆపరేటర్ డిమాండ్ చేయగా భాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా పట్టనున్న ఏసీబీ అధికారులు, ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలను నిర్వహించారు.