. . . పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు
హైదరబాద్, బతుకమ్మ:
ప్రభుత్వం ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధం ఎత్తివేసి ట్రాన్స్ ఫర్ లు చేపడితే విద్యాశాఖాధికారులు నిబంధనలకు నీళ్ళోదిలి బదిలీలు చేయడం వివాదాస్పదం అయింది. జగిత్యాల జిల్లా సమగ్రశిక్ష విభాగంలో పనిచేస్తున్న సుంక సూరజ్ సోమవారం నిజామాబాద్ విద్యాశాఖాధికారుల తీరుపై పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా వాసి ఐనా సూరజ్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా సమగ్ర శిక్షలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూరజ్ మల్టీజోన్ 1, బాసర జోన్ 2 లో జనరల్ క్యాడర్ లో బదిలీ కోసం స్పౌజ్ గ్రౌండ్ లో వరంగల్ అర్ జేడికి దరఖాస్తు చేశారు. సూరజ్ ధరఖాస్తు ఆధారంగా ప్రిపరేన్షియల్ కేటగిరిలో చూపకుండా ప్రాబ్లీ వోకేన్సీ లాగా చూయించి అతడికి స్పౌజ్ గ్రౌండ్ లో నిజామాబాద్ విద్యాశాఖలో ఉన్న కంపల్సరీ వెకేన్సీలో పోస్టును కేటాయించాలి. కానీ అదే స్థానంలో గత ఐదు సంవత్సరాల 10 నెలలుగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ను కంపల్సరీ వెకేన్సీలో బదిలీ చేసి అస్థానం సూరజ్ కు కేటాయించాలి. అతడిని రిటైన్ ఎట్ సెమ్ ప్లేస్ ఖాళీలు లేవని చూపారు. జిఓ 38 ప్రకారం స్పౌజ్ గ్రౌండ్ లో మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న స్థానంలో పోస్టింగ్ ఇవ్వకుండా అన్యాయం చేశారని, తనకు నిజామాబాద్ డిఇఓ కార్యాలయంకు బదిలీ చేయాలని ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు స్పందించకపోతే ట్రిబ్యూనల్ ను ఆశ్రయిస్తానని బాధితుడు సూరజ్ తెలిపారు.